ఆత్మకూరు పట్టణంలో ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి శతజయంతి వేడుకలు
నంద్యాల జిల్లా, ఆత్మకూరు పట్టణంలోని గౌడ్ సెంటర్లో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి 101వ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.వాజ్పేయి చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి, పాలాభిషేకం చేస్తూ ఆయనకు గౌరవప్రదంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఓకరికి óకరు మిఠాయిలు తినిపించుకుంటూ వేడుకను కొనసాగించారు. ఈ సందర్భంగా వాజ్పేయి దేశ రాజకీయాల్లో చేసిన సేవలు, భారత్ అభివృద్ధికి ఆయన అందించిన కృషిని స్మరించుకొంటూ బీజేపీ శ్రేణులు ఆయనను కొనియాడారు. భారతీయ రాజకీయాల్లో శాంతి, అభివృద్ధి, ప్రగతికి వాజ్పేయి చూపిన మార్గం నేటికీ స్ఫూర్తిదాయకమని నాయకులు అభిప్రాయపడ్డారు.