గన్నేరువరం: గునుకుల కొండాపూర్లో కూలుతున్న రోడ్డు పక్కన బావులు, ప్రమాదం పొంచి ఉందని చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి #localissue
కూలుతున్న రోడ్డు పక్క బావులు..పొంచి ఉన్న ప్రమాదం.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి నుండి మండల కేంద్రం గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు జరుగుతున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనుల్లో ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో రోడ్డుపక్క బావులు, రక్షణ గోడలు విషయంలో ఆర్ అండ్ బీ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకుండా వాటికి నిధులు కేటాయించకపోవడంతో కాంట్రాక్టర్ రోడ్డు పక్క బావుల రక్షణ చేయడం లేదని ప్రచారం సాగుతుంది. గునుకుల కొండాపూర్ లో శనివారం రాత్రి కురిసిన వర్షానికి గుండ్లపల్లి గ్రామానికి చ