గిద్దలూరు: అడవులను సంరక్షించకపోతే మానవ మనుగడకే ముప్పు: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి
అడవులను సంరక్షించకపోతే మానవ మనుగడకే ముప్పు వాటిలే అవకాశం ఉందని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దిగువమెట్ట సమీపంలోని వన విహారి పార్కులో నిర్వహించిన వాన మహోత్సవ సమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడారు. అడవుల వల్ల లభించే ఆక్సిజన్ వల్లే మనిషి జీవిస్తున్నాడని అమెజాన్ అడవులలో కారుచిచ్చు అంటుకోవడం వల్ల అడవులు తగ్గిపోయే ప్రమాదం వాటిలిందన్నారు. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో అడవులు కూడా తగ్గిపోతూ వస్తున్నాయని అలా కాకుండా వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు.