తిరుపతి రూరల్ మండలం ఓటేరు పంచాయతీలో నివాసముంటున్న ఓ రైతు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు7.5 లక్షలు దోచేశారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలోని ఎగురెడ్డిపల్లికి చెందిన రైతు తన పిల్లల చదువు కోసం తిరుపతిలో నివాసం ఉంటున్నాడు. రైతు ఫోన్ నెంబర్ వాట్సప్ కు పి ఎం జె వై కిసాన్ యోజన పథకం పేరుతో ఒక లింక్ వచ్చింది లింక్ ఓపెన్ చేయడంతో వ్యక్తిగత వివరాలను అడిగిన సైబర్ నేరగాలకు సమాచారం ఇచ్చాడు రైతు అకౌంట్లో ఉన్న పది లక్షల 81 వేల రూపాయలలో 750 వేల రూపాయలు నగదు విత్ డ్రా అయినట్లు ఫోన్ కు మెసేజ్ వచ్చింది బాధితుడు వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.