తాడపత్రి పట్టణంలోని పాతకోట ఏరియాలో నివాసముండే శంకరప్ప అనే వ్యక్తి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాడని పోలీసులు ఆదివారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శంకరప్ప తనుకు సంబంధించిన ఖాళీ స్థలంలో పూజలు చేసి, తవ్వకాలు చేశారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పాతకోట ఏరియాకు వెళ్లి గుప్త నిధులు కోసం తవ్వకాలు జరుపుతున్న శంకరప్పను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. శంకరప్పను పోలీసులు విచారిస్తున్నారు.