కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రిలయన్స్ స్మార్ట్ సమీపంలో మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కూకట్పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతి చెందిన మహిళ బీహార్ కు చెందిన వారిగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగానే ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.