అసిఫాబాద్: ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నియోజకవర్గ ఇంచార్జి శ్యాం నాయక్ దరఖాస్తు
ఆసిఫాబాద్ డీసీసీ బాధ్యతలను తమకు అప్పగించాలని ఆసిఫాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ శ్యాంనాయక్,తో పాటు 25 మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. ఆసిఫాబాద్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఏఐసీసీ పరిశీలకులు నరేష్ కుమార్ కు వారు దరఖాస్తు పత్రాన్ని అందించారు. ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నిస్వార్థంగా సేవలందించిన వారికే డిసిసి పదవి దక్కుతుందని కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు. డీసీసీ పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.