దేవరకొండ: కాంగ్రెస్ 22 నెలల పాలనలో సుబ్బండ వర్గాలు ఆందోళన బాట పట్టాయి:బిఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్
నల్గొండ జిల్లా:బిఅర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు అన్నారు.ఆదివారం నేరడుగొమ్ము మండలం ధర్మారేఖ్య తండాకు చెందిన 100మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారి సమక్షంలో చేరారు. పార్టిలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ 22నెలల పాలనలో సబ్బండవర్గాలు ఆందోళన బాట పట్టాయన్నారు.