ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దారుణం : సిపిఎం నగర్ కార్యదర్శి కత్తి శ్రీనివాసులు
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వాలు కుట్రలు చేయడం దారుణమని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మండిపడ్డారు. కార్మికులను బానిసలుగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలు ఇస్తూ కార్మిక హక్కులని కార్పొరేట్ శక్తులు కాల రాస్తున్నాయని విమర్శించారు. నెల్లూరులో కత్తి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు.