పూతలపట్టు: కృష్ణంపల్లిలో నూతన సబ్స్టేషన్ ఏర్పాటు లపై స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో శ్రీనివాసులు
యాదమరి మండలం కృష్ణం పల్లి గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణం కోసం ఆర్డిఓ శ్రీనివాసులు తాహసిల్దార్ పార్థసారథి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన కృష్ణం పల్లి గ్రామానికి విద్యుత్ శాఖ డిఈ ముని చంద్ర తో కలసి గ్రామంలోని సబ్ స్టేషన్ నిర్మించడానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఒక కోటి 30 లక్షల అంచనాతో లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడానికి సబ్స్టేషన్ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక విద్యుత్ ఏఈ గురప్ప సర్వేయెర్ తులసి పాల్గొన్నారు.