కొండపల్లిలో కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
Mylavaram, NTR | Sep 22, 2025 పని గంటలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేశ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పని గంటల పెంపునకు వ్యతిరేకంగా కొండపల్లి ఐడీఏలోని ఓ గ్యాస్ కంపెనీ వద్ద కాంట్రాక్ట్ వర్కర్స్, ముఠా వర్కర్స్, డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. కార్యక్రమంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు.