నగరి: వడమాలపేట మండలం లక్ష్మమ్మ కండ్రిగ కొత్త చెరువుకు గండి, నిలిచిన రాకపోకలు
వడమాలపేట మండలం లక్ష్మమ్మ కండ్రిగ కొత్త చెరువుకు మంగళవారం గండి పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువుకు నీరు చేరింది. ఈక్రమంలో గండి పడి ఎస్టీ కాలనీకి రాకపోకలు స్తంభించాయి. ఎమ్మెల్యే భాను ప్రకాశ్ ఆదేశాలతో అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.