అసిఫాబాద్: తిర్యాణి మండలంలో భారీ వర్షం,ఉల్లిపిట్ట గ్రామానికి నిలిచిన రాకపోకలు
తిర్యాణి మండలంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి ఉల్లిపిట్ట వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. తిర్యాణి మండలం ఉల్లిపిట్ట గ్రామం వద్ద ఉన్న లోలెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించడంతో ఉల్లిపిట్ట గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు, వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.