జిల్లాకు కొత్తగా 6,57,248 క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డులు ప్రభుత్వం నుంచి సరఫరా: జాయింట్ కలెక్టర్ శివ నారాయణ
Anantapur Urban, Anantapur | Sep 15, 2025
జిల్లాకు కొత్తగా 6,57,248 క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డులు ప్రభుత్వం నుంచి సరఫరా చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అనంతపురం నగరంలోని అశోక్ నగర్ లో సచివాలయ ఉద్యోగుల ద్వారా కార్డుదారుల ఇంటి వద్దనే వారికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డులను జాయింట్ కలెక్టర్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ జిల్లాలోని అన్ని మండలాల్లో ఈరోజు ప్రారంభమైందన్నారు.