మహబూబాబాద్: కొత్తగూడలో అక్రమంగా తరలిస్తున్న వన్యప్రాణి మాంసం పట్టివేత, వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో వన్యప్రాణి మాంసం అమ్మకాలు యదేచ్ఛగా సాగుతున్నాయి. సోమవారం కొత్తపల్లి నుండి కొత్తగూడ వైపు అడవి పంది మాంసం తరలిస్తుండగా, బైక్ అదుపుతప్పి మాంసం అక్రమ రవాణా బయటపడింది. ఈ ఘటనలో రవాణా చేస్తున్న చింత సత్యం అనే వ్యక్తిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.