ప్రకాశం జిల్లా కొమరోలు ఎస్ఐ నాగరాజు మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. క్రిస్టమస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అలానే గిఫ్టులు వచ్చాయని ఏపీకే ఫైల్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయని వాటిని తెరచి తమ బ్యాంకు ఖాతాలోని నగదు మాయం చేసుకోవద్దని ఎస్ఐ ప్రజలకు సూచించారు. సైబర్ నేరగాళ్లు ఈ విధంగా వలవేసే అవకాశం ఉందని ప్రజలు వాటిని తెరచి మోసపోవద్దని అన్నారు.