పీలేరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు పై హర్షం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు
పీలేరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు పై టీడీపీ శ్రేణులు బుధవారం తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో డయాలసిస్ పేషెంట్లు సెంటర్లు లేక దూర ప్రాంతాలకు అనేక ప్రయాసల కోరి వెళ్లి వేస్తున్నామని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో డయాలసిస్ పేషెంట్లు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. అదే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పీలేరు కు డయాలసిస్ సెంటర్ కేటాయించారు