మేడ్చల్: ఓయూలో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటాలను చించివేసిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రౌడీ షీటర్ నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చారని బీసీలను అవమానపరిచిన మాజీ సీఎం కేసీఆర్ వెంటనే బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగమ్ గౌడ్ డిమాండ్ చేశారు. కెసిఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆయన చిత్రపటాల ను చింపేశారు. తక్షణమే కెసిఆర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు.