కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గురువారం కోడి పందాలు విచ్చలవిడిగా జరిగాయి. స్థానిక నేతల ఒత్తిళ్ళతో పోలీసు అధికారులు కోడిపందాలు వస్తా వరాలపై కనీసం కన్నెత్తి కూడా చూడలేదని తెలుస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా అనాదిగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను కాదనలేక కీలక నాయకులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించాలని పోలీసులకు చెప్పడంతో పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. అంతేకాకుండా కోడి పందాలను కోట్ల రూపాయలు చేతులు మారి యజమానులకు కోళ్లు కనక వర్షం కురిపించాయి.