బొబ్బిలి: బొబ్బిలిలో వాడవాడలా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
బొబ్బిలిలో వాడవాడలా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న శ్రీరామాలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. అలాగే శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు రమ్యంగా శ్రీసీతారామ కల్యాణం నిర్వహించారు. మండలంలోని పిరిడి, చింతాడ, మెట్టవలస గ్రామాల్లో శ్రీసీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా చేశారు.