గద్వాల్: జిల్లాలో విశ్వకర్మలు అన్ని విధాలుగా అభ్యున్నతి సాధించాలి:ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
విశ్వకర్మలు అన్ని విధాలుగా అభ్యున్నతి సాధించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చేతివృత్తుల ద్వారా విశ్వకర్మలు జీవనోపాధి పొంది, ఇతరులకు ఉపాధి కల్పించాలని ఆయన సూచించారు.