మాచర్ల పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన పిన్నెల్లి సోదరులు
పల్నాడు జిల్లా,మాచర్ల పోలీస్ స్టేషన్లో పోలీసుల విచారణకు పిన్నెల్లి సోదరులు శనివారం హాజరయ్యారు. గుండ్లపాడు జంటహత్యల కేసులో పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకటరామిరెడ్డిని విచారించనున్నారు. ఈ నేపథ్యంలో సీఐ నఫీజ్ బాషా ఆధ్వర్యంలో పోలిస్ స్టేషన్ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.