ఆర్టీసీ కాలనీలో 18 లక్షలతో కానాజీగుడా శివ నగర్ కాలనీలో 32 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. నాలాపై కప్పు లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ సదుపాయాల మెరుగుదలకు వెంటనే చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో కట్టుదిట్టంగా వ్యవహరించాలని తెలిపారు.