ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పగుళ్ల గ్రామస్తులు గిద్దలూరు అటవీశాఖ కార్యాలయం ముందు బుధవారం ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన మేకల తిమ్మయ్య అనే వ్యక్తిని కొండముచ్చు ను చంపాడని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తిమ్మయ్య గన్నుతో కాల్చి కొండముచ్చును చంపినట్లుగా ఒప్పుకోవాలని అటవీశాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపించారు. రేస్ కుక్కల దాడిలో కొండముచ్చు చనిపోయిందని తిమ్మయ్య కొండముచ్చును చంపలేదని గ్రామస్తులు వెల్లడించారు. స్టేషన్ బెయిల్ ఇస్తామని అటవీశాఖ అధికారులు తీసుకువచ్చి తిమ్మయ్యను రహస్య ప్రదేశంలో దాచారన్నారు.