అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఐచర్, ఇద్దరికీ తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Nov 11, 2025
అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె సమీపంలో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని గ్యాస్ సిలిండర్ల లోటుతో వెళుతున్న ఐచర్ వాహనం ఢీకొన్న ఘటన లో కేకే అగ్రహారం గ్రామానికి చెందిన ఆదినారాయణ, కాటమయ్య అనే ఇద్దరికీ గాయాలయ్యాయి. వారిని అనంతపురం ప్రభుత్వ సరోజన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.