సుందరయ్య కాలనీ సమీపంలో లారీ ఓనర్ పై దాడి, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దృశ్యాలు
నెల్లూరులోని సుందరయ్య కాలనీ జాతీయ రహదారిపై ఓ లారీ డ్రైవర్ పై కొందరు దాడి చేసిన దృశ్యాలు బుధవారం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. EMI లు చెల్లించలేదంటూ కొందరు లారీ డ్రైవర్ పై దాడి చేశారు. తను సకాలంలో ఈఎంఐలు చెల్లిస్తున్నానని చెప్పిన వినకపోవడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.