హెరిటేజ్ కంపెనీని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వండి: బీఎస్పీ
హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి CM చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలని BSP ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్య క్షుడు గౌతమ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరించే బదులు, ముందుగా హెరిటేజ్ కంపెనీని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలన్నారు.