బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మెంతా తుఫాన్ ఈనెల 27 ,28 ,29 తేదీల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.. శనివారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా విపత్తు నిర్వహణపై జిల్లా మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తిక్, ఏఎస్పి యుగంధర్ బాబు, డిఆర్ఓ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు