కర్నూలు: హంద్రీనీవా పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రామకృష్ణ రెడ్డి డిమాండ్ చేశారు.
హంద్రీనీవా పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రామకృష్ణ రెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం నిరసన చేపట్టారు. హంద్రీనీవా వెంబడి ఆక్రమణలు, చెత్తాచెదారం పేరుకుపోయినా అధికారులు పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త కారణంగా జనవాసాల్లోకి నీళ్లు చేరుతున్నాయని, వెంటనే సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులు స్పందించాలని కోరారు.కార్యక్రమంలో కన్వీనర్ రామకృష్ణ రెడ్డి, కో కన్వీనర్ చాంద్, ఏఐటీయూసీ మనోహర్ మాణిక్యం, నాగన్న తదితరులు పాల్గొన్నారు. ---