అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయినగర్ వద్ద ఉన్న జెఎన్టియు విశ్వవిద్యాలయంలో శనివారం 10 గంటల 20 నిమిషాల సమయంలో అనంతపురం కలెక్టర్ ఆనంద్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నందు పర్యావరణ అవకాశాలు అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ టాటా ఇన్నోవేషన్ హబ్ నందు పర్యావరణంలో అవకాశాలు ఇతివృత్తంతో సత్యాంద్ర కార్యక్రమాన్ని వర్క్ షాప్ లో ప్రారంభించడం జరిగిందని, విద్యార్థినిలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థినీలు పాల్గొన్నారు.