బనగానపల్లెలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లె పట్టణ అవుకు మెట్ట ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం భూమి పూజా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని పనులను ప్రారంభించారు. ఎస్ఆర్బీసీ కార్యాలయ సమీపంలో రెవెన్యూ మ్యాప్లను పరిశీలించిన మంత్రి, లేఅవుట్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పేదల సొంతింటి కలను త్వరగా సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.