సిర్పూర్ టి: సిర్పూర్ నియోజకవర్గం లోని కౌటాల, చింతల మానేపల్లి మండలాలలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
సిర్పూర్ నియోజకవర్గం లోని కౌటాల చింతల మానేపల్లి మండలాలలో ఇసుక మాఫియా రోజురోజుకు రెచ్చిపోతుంది. డబ్బా దారంపల్లి వాగులో నుండి ట్రాక్టర్ల ద్వారా బోధoపల్లి గ్రామ సమీపంలోని దారంపల్లి సమీపంలో భారీ సంఖ్యలో ఇసుకను ఇలాంటి అనుమాతల్లేకుండా డంపు చేశారు. డంపింగ్ చేసిన ఇసుక కుప్పలను జెసిబిల ద్వారా లారీలలో ఎక్కించి హైదరాబాద్కు తరలిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రింబగళ్లు తేడా లేకుండా ఇదేచ్ఛగా కొనసాగుతున్న ఇసుక మాఫియా పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు,