సూపర్ సిక్స్‌లో మహిళలకే అధిక ప్రాధాన్యత: మంత్రి గొట్టిపాటి
రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు చేయడంపై వినుకొండ పట్టణంలో శివశక్తి లీలా&అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూపర్ సిక్స్-సూపర్ హిట్ అంటూ బుధవారం సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్,ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు,రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ,శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి కుటుంబాలలో వెలుగు నింపిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు.