కర్నూలు: కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద సందడి చేసిన సైక్ సిద్ధార్థ సినిమా హీరో హీరోయిన్
కర్నూలు లో ఆదివారం ఉదయం 11 గంటలకు సైక్ సిద్దార్థ్ సినిమా హీరో హీరోయిన్ లు సందడి చేశారు. డిశంబర్12న సైక్ సిద్దార్థ్ సినిమా విడుదల సందర్భంగా ప్రమెషన్లో భాగంగా హీరో నందు, హీరోయిన్ యామిని భాస్కర్ కర్నూలు కొండారెడ్డి బురుజు వద్దకు వచ్చారు. సైక్ సిద్దార్థ్ సినిమా కుటుంబ సభ్యులతో కలిసి చూడాల్సిన సినిమా అని హీరో నందు తెలిపారు. కొండారెడ్డి బురుజు వద్ద సినిమా షూటింగ్ చేసిన ఈవెంట్ చేసిన బ్లాక్ బాస్టర్ అవుతుందని సైక్ సిద్దార్థ్ సినిమను ఆదరించాలని కోరారు. హీరో హీరోయిన్ లతో ఫోటోలు దిగేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు.