భూపాలపల్లి: బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : మునిసిపల్ కమీషనర్ బిర్రు శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్య పండుగ బతుకమ్మ పండుగ_ ఇట్టి బతుకమ్మ పండుగ మరియు దసరా పండుగ సందర్భంగా భూపాలపల్లి పురపాలక సంఘ కార్యాలయం పరిధిలోగల పుల్లూరి రామయ్య పల్లి, మహబూబ్ పల్లి, భాస్కర్ గడ్డ మరియు వేషాలపల్లి లో గల బతుకమ్మ ఆడు స్థలాలను శ్రీయుత మున్సిపల్ కమిషనర్ బి. శ్రీనివాస్ గారు పరిశీలించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ బి. రజనీకర్ గారు, మున్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ బి. మానస గారు, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ జీ నవీన్ గారు, వర్క్ ఇన్స్పెక్టర్ లు మరియు వార్డులకు సంబంధించిన జవాన్లు అందరూ పాల్గొనడం జరిగినది బతుకమ్మ ఆడు స్థలాలలో ప్రజలకు సమకూర్చలన్నారు.