రాయదుర్గం: బొమ్మనహాల్ మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టిన పోలీసులు
బొమ్మనహాల్ మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు చేపట్టారు. నేమకల్లు గ్రామం నుంచి హిర్దేహాల్ కు వెళ్లే దారిలో ఇరువైపులా కంపచెట్లు పెరిగి ప్రమాదాలకు కారణం అవుతుండటంతో బొమ్మనహాల్ ఎస్ఐ నభిరసూల్ ఆధ్వర్యంలో కంపచెట్లు తొలగించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామస్తుల సహకారంతో జెసిబి ఏర్పాటు చేసి మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు కంపచెట్లు తొలగించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.