అసిఫాబాద్: రెబ్బెన సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులు యూరియా కోసం పట్టా పాస్ పుస్తకాల క్యూలైన్
రెబ్బెన మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి యూరియా బస్తాలు వచ్చాయని తెలియడంతో వివిధ గ్రామాల నుండి రైతులు సోమవారం ఉదయం ఏడు గంటల నుండి క్యూలైన్లో నిల్చున్నారు. రైతులు ఉదయాన్నే ఏమి తినకుండా రావడంతో ఆకలికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు రైతులు మహిళలు పురుషులు వేరువేరుగా ఒక వరుస పద్ధతిలో క్యూలైన్ పట్టా పాస్ పుస్తకాలను పెట్టి టిఫిన్ సెంటర్లలో టిఫిన్ చేయడానికి వెళ్లారు. యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు ఇంటి వద్ద పనులను వ్యవసాయ పనులను సైతం వదిలేసుకుని వచ్చి క్యూలైన్లో నిలబడి తమకు వచ్చిన ఒకటి రెండు బస్తాలను తీసుకుని వెళుతున్నారు.