సిర్పూర్ టి: కాగజ్ నగర్ లో దివ్యాంగుడి చేత కేక్ కట్ చేయించి ప్రధాని మోడీ జన్మదిన జరిపిన ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు క్రికెట్ గ్రౌండ్ లో ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా సిర్పూర్ కు చెందిన దివ్యాంగుడి చేత కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఘనంగా నిర్వహించారు. 75 సంవత్సరాల వయసులో దేశ ప్రధాని నరేంద్ర మోడీ నవ యువకుడిగా దేశాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నాడని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు,