కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసి ఆఫీసులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన సిబ్బంది హుటాహుటిన అక్కడ నుంచి పరుగులు తీశారు. వారి సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను ఆరిపారు. రెవెన్యూ సెక్షన్లో ఫైల్స్ తగలబడి దట్టమైన పొగలు అలముకున్నాయి. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది జిహెచ్ఎంసి సిబ్బందిని కాపాడారు. బాలానగర్ ఏసిపి నరేష్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.