మంత్రాలయం: వైసీపీకి చెందిన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటాం :మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగి రెడ్డి
మంత్రాలయం:వైసీపీకి చెందిన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. మంత్రాలయం మండల కేంద్రానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు శివప్ప, వార్డు మెంబర్ గంగమ్మ కుమారుడు సంపత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వారి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈయనతో పాటు పలువురు వైసిపి నేతలు పాల్గొన్నారు