ఆదోని: ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయకూడదని, ఆదోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బిక్షటన
Adoni, Kurnool | Sep 17, 2025 ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. SFI ఆధ్వర్యంలో బిక్షాటన చేశారు. బుధవారం మున్సిపల్ మెయిన్ రోడ్ లో అర్థనగ్నంగా రోడ్డుపై పాదాచార్లను దుకాణదారుల నుండి బిక్షాటన చేశారు. ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి రంగప్ప, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు పట్టణ కార్యదర్శి శశిధర్ మాట్లాడారు.. ప్రభుత్వ ధనంతో నిర్మించిన కళాశాలను నిర్వహణ కోసం ప్రైవేటుకు అప్పజెప్పడం ప్రభుత్వానికి తగదు అన్నారు. 60శాతం కళాశాల నిర్మాణం జరిగిందని కొంతవరకు నిధులు కేటాయిస్తే పెండింగ్ పనులు పూర్తిచేసి ప్రభుత్వం ప్రారంభిస్తే సరిపోతుందన్నారు.