కాప్రా సర్కిల్ లో టి యు డబ్ల్యూ జె, ఐజేయు ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై డిసెంబర్ 3న జరిగే మహాధరణ పోస్టర్ను ఆవిష్కరించారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నేతలు తీవ్రంగా ఖండించారు. హెల్త్ స్కీమ్, అక్రిడేషన్ పాలసీ, భద్రత, ఇండ్ల స్థలాల మంజూరు వంటి కీలక సమస్యలు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.