సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం ఆకుల లింగాపూర్ గ్రామంలో జరుగుతున్న మార్కండేయ మహాపర్వం 4వ వార్షికోత్సవం సందర్భంగా, బొంబాయికు చెందిన నరేష్ మహారాజ్ మాట్లాడుతూ గ్రామంలో ఆరు రోజులపాటు అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నరేష్ మహారాజ్ మాట్లాడుతూ పరమాత్ముని నామస్మరణ భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక మార్పుకు దారితీస్తుంది. దైవ సంకల్పబలం మనిషిని సత్మార్గంలో నడిపిస్తుంది. భక్తిమార్గం ద్వారా లభించే ఆత్మశాంతి, వ్యక్తిగత వికాసానికి దోహదం చేస్తుందన్నారు.