నాయుడుపేటలో ఏఎంసి నూతన పాలకవర్గం సమావేశం
- పాలకమండలి ప్రమాణస్వీకారం గురించి మాట్లాడిన ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్
తిరుపతి జిల్లా నాయుడుపేట వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నూతన నూతన పాలకవర్గం త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఎ ఎం సి చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ అన్నారు. బుధవారం నాయుడుపేట ఏఎంసీ కార్యాలయంలో నూతన పాలకవర్గ సభ్యులు, ఏఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం తేదీ ఏర్పాట్లపై చర్చించారు. తమపై నమ్మకం ఉంచి నాయుడుపేట ఏఎంసీ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ లకు ధన్యవాదములు తెలియజేశారు. త్వరలో ఏఎంసీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార తేదీని వెల్లడిస్తామని