అనంతపురం నగరంలోని సాయి నగర్ మూడో క్రాస్ లో శుక్రవారం రాత్రి 8:30 సమయంలో మద్యం మత్తులో ఆటో డ్రైవర్ అబ్దుల్ కరీం పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. అబ్దుల్ కరీం ఆటో పెట్టి ఇంటిలోకి వెళ్తుండగా ఆటో వద్ద కత్తితో పొడిచి పరారయ్యాడు. అబ్దుల్ కరీంకో తీవ్ర గాయాలవడంతో మెరిగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.