వైరా: వైరా మున్సిపాలిటీ ఎదుట సిపిఎం పార్టీ నిరసన
Wyra, Khammam | Sep 20, 2025 శ్మశాన వాటికకు రహదారి లేక పేద ప్రజలు నరకం అనుభవిస్తున్నారని, పేద కుటుంబంలో మరణం సంభవిస్తే బంధువులు చందాలు వేసుకొని దహన సంస్కారాలు చేయాల్సిన దుస్థితిలో హనుమాన్ బజార్ లోని పేద ప్రజలు బ్రతుకు తున్నారని సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. శనివారం సిపిఐ(ఎం) వైరా శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ బజార్ శ్మశాన వాటికకు బౌండరీలు ఏర్పాటు చేసి శాశ్వతంగా రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు వైరా మున్సిపాలిటీ ముందు ధర్నా చేశారు. అనంతరం మున్సిపాలిటీ కమిషనర్ గురులింగం కు వినతిపత్రాన్ని అందించారు.