గిద్దలూరు: విజయవాడలో ఈనెల 25న యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ నాయకులు రాచర్లలో వెల్లడి
ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని నేపథ్యంలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు రణభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యుటిఎఫ్ నాయకులు సోమవారం వెల్లడించారు. సోమవారం రాచర్ల మండలంలో చలో విజయవాడ రణభేరి కార్యక్రమం యొక్క గోడపత్రికను యూటీఎఫ్ నాయకులు సభ్యులు ఆవిష్కరించారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్న ఇంతవరకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పిఏలు, డిఏలు పెండింగ్లో ఉన్నాయని పిఆర్సి చైర్మన్ రాజీనామా చేసిన ఇంతవరకు కేటాయించలేదని దీనిపై యుటిఎఫ్ తీవ్రంగా స్పందిస్తూ ఈనెల 25న విజయవాడలో భారీ రణబెరి బహిరంగ సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు.