ఆందోల్: ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ మెడలోని బంగారాన్ని కాజేసిన దుండగులు
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం ఓ మహిళ ఆసుపత్రికి వెళ్లగా మెడలో ఉన్న బంగార గొలుసును చోరీ చేశారు దుండగులు. బాధితురాలు వివరాల ప్రకారం ఆందోల్ మండలం పోసానిపేట గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి ప్రసవం కోసం ఆసుపత్రికి రాగా ఆపరేషన్కు ముందు ఆమె తన మెడలోని నాలుగు గ్రాముల బంగారు పుస్తేల తాడును అక్కడి సిబ్బందికి ఇవ్వగా ఆపరేషన్ తర్వాత ఆమె గొలుసు ఇవ్వమని మంగళవారం నాడు ఆసుపత్రి సిబ్బందికి అడగగా అలాంటిదేమీ తమకు ఇవ్వలేదని నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు.