కుప్పం: శాంతిపురం : నిర్మాణంలో ఉన్న భవనంలో వ్యక్తి మృతి.
శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లిలో ఓ వ్యక్తి చనిపోయాడు. నిర్మాణంలో ఉన్న భవనంలో మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం నాడు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో గుర్తించారు. వారి సమాచారంతో రాళ్లబూదుగూరు పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు సంతూరుకు చెందిన కృష్ణమూర్తిగా గుర్తించారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.