ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గార్లపేట గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం స్థానిక పోలీసులకు అందిన సమాచారం మేరకు పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుంచి రూ.4,280 నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టరీత్య నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.